Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48 టీంలు...12,436 దరఖాస్తులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలో ఇండిస్టియల్ ఏరియాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ఐదు రోజులపాటు సాగిన దరఖాస్తుల స్వీకరణలో 48 వార్డులకుగాను 12,436 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు పంచాయతీరాజ్ అధికారులను నియమించారు. వార్డుకు ఒక బృందం చొప్పున 48 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్, ఇద్దరు రిసోర్స్ పర్సన్లు మొత్తం ఐదుగురిని బృందంగా నియమించారు. 9 వార్డులకు మండల పంచాయితీ అధికారి పర్యవేక్షించనున్నారు. శుక్రవారం పట్టణంలోని అన్ని వార్డులలో అధికారులు దరఖాస్తులపై విచారణ చేపట్టారు. సీతారాంపురంలో విచారణ బృందం ఇంటింటికి తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ బిక్షం రాజు, డిప్యూటీ తహసీల్దార్ సైదులు, పంచాయతీ కార్యదర్శులు ఎస్కే. జాఫర్, జూనియర్ పంచాయితీ కార్యదర్శి కందిమల్ల నరేందర్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు విజయ, మెహరాజున్నిసా, ఆర్పీలు శశికళ, శకుంతుల, ఇందిరా, మెరాజ్ తదితరులు పాల్గొన్నారు.