Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజీపీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
గ్రామపంచాయతీ కార్మికులకు బకాయిలుగా ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ నిర్వహించే చాలా హైదరాబాదును జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవా అధ్యక్షులు దాసరి పాండు కోరారు. శనివారం మండలంలోని భువనగిరి మండలంలోని బొల్లెపల్లి, సూరే పల్లి, రెడ్డి నాయక్ తండా, ఆకుతోట బావి తండా, నందనం , నాగిరెడ్డిపల్లి, ఎర్రంబెల్లి, తుక్కాపురం, నమాత్ పెల్లి, అనాజిపురం గ్రామాలు తిరిగి ప్రచారం నిర్వహిం చారు.ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. ఐదు నెలలుగా చెల్లించకుండా సిబ్బందితో చాకిరి చేయించుకుంటున్నాయని తరబడిగా ఏండ్ల తరబడిగా ఆశతో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన గ్రామ సిబ్బంది పట్ల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేవని పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ నెల 12 నుంచి పాదయాత్ర నిర్వహించి 28 సందర్భంగా ఇంద్ర పార్క్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశయ్య నరసింహ మైసయ్య వెంకటేశం అనిత భాగ్య లావణ్యలు పాల్గొన్నారు.