Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్
బాలల హక్కుల పరిరోణ ప్రతి ఒక్కరీ బాధ్యత అని జిల్లా సంక్షేమ అధికారి కేవీ.కృష్ణవేణి అన్నారు. శనివారం మండలంలోని మల్లపురంలో ఎంపీపీఎస్‌లో స్నేహిత రెండో విడత అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు తమ పై జరిగే హింసను ఎదుర్కోవానికి 1098,100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. పిల్లలు పౌష్ఠికాహారం తీసుకోవాలని వాటి ద్వారా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. అదేవిధంగా జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బండారు జయశ్రీ మాట్లాడుతూ బాలల స్నేహపూర్వక వాతావరణం అనుకూలంగా ప్రతి ఒక్కరూ. తోడ్పాటును అందించాలని కోరారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు మాట్లాడుతూ పిల్లలకు చెడు, మంచి స్పర్శలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, స్నేహిత టీమ్ సభ్యులు పాల్గొన్నారు.