Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
విషవాయువులను విడుదల చేస్తున్న హెజులో, ఆప్టిమస్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు డిమాండ్ చేశారు. మండలంలోని దోతిగూడెంలో ఉన్న హెజ్లో, ఆప్టమస్ పరిశ్రమల నుండి వెలువడుతున్న విషవాయుల వల్ల ప్రజలు ఆనారోగ్యంపాలవుతున్నారని, కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్వాసన వెదజల్లే రసాయన పరిశ్రమలు అనేకంగా పుట్టుకొచ్చాయన్నారు. పరిశ్రమలు వెదజల్లే దుర్వాసన వల్ల ప్రజలు కిడ్నీ ,గుండె సంబంధిత వాధ్యుల బారిన పడి చనిపోతున్నారని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కలుషితమై నీటిని తాగిన పాడి పశువుల పాలు కలుషితుమవుతున్నాయన్నారు. చిన్న పిల్లల ఎదుగుదల ,గర్బస్త్రావాలు ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సాయంత్రం 6 దాటిందంటే పరిశ్రమల దుర్వాసన విచ్చలవిడిగా రావడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయన్నారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా పీసీసీబీ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా వెంటనే ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. స్థానికుడు సత్యం యాదవ్ మాట్లాడుతూ మూడు నెలల నుండి పరిశ్రమ నుండి విషవాయువులను విడుదల చేస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నారన్నారు. గతంలోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం మాత్రం శూన్యంగా ఉందన్నారు. మూడు రోజుల నుండి భారీ ఎత్తున ల్యాబ్ నుండి విషవాయువులను వదలడంతో గ్రామస్తులలో శ్వాసకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందన్నారు. చిన్నపిల్లలు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల అనేక ఇబ్బంది పడుతూ ప్రాణాన్ని గుప్పట్లు పెట్టుకొని గ్రామంలో నివసించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.