Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,000ల మంది రిజిస్ట్రేషన్ల నమోదు
- బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలోని 45వ వార్డు విద్యానగర్లో నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఉచిత నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.శనివారం ఐదో రోజు స్థానిక విద్యానగర్ గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద నిర్వహిస్తున్న ఉచిత రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. నేటి వరకు 3,000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారన్నారు.మాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ నమోదు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో గండూరి సుధీర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబు, కుమ్మరికుంట్లలింగయ్య, సుంకరిరమేష్, నాశనబోయిన భరత్, మెరుగు రమేష్, నాగాచారి, పోగుల శ్రీను, దేవరశెట్టి ప్రవీణ్, మధు, జగదీష్, సతీష్, ఇస్మాయిల్, ఎం.కల్యాణ్, నవీన్, వెంకటేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.