Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో 21/02/2023 నుండి ప్రారంభమైన ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షలు బ్రిడ్జి కోర్స్‌తో సహా 25/02/ 23 వరకు ప్రశాంతంగా ముగిశాయని దీనికి మొదటి సంవత్సర విద్యార్థులు 104 మందికి 80 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ నెల్లుట్ల రాజు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు 62 మందికి 42 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు.మొదటి,ద్వితీయ విద్యార్థిని విద్యార్థులు 42 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు.మొత్తం 122 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలకు ఏడుగురికి అందరూ హాజరయ్యారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్స్‌టర్నల్స్ పి.గణేష్, డి.భగత్‌సింగ్, కళాశాల కరస్పాండెంట్ తీగుళ్ల శ్రీనివాస్, అధ్యాపకులు వైస్ ప్రిన్సిపాల్ సంగెపాక ప్రభాకర్, దురుసోజు ఉపేందర్, మోడెపు సురేందర్, కరుణ, వేమన, విద్యార్థిని విద్యార్థులు పాల్గొ న్నారు.