Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
అన్ని గ్రామాలల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందించడం కోసమే సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన రాబోవు వేసవి కాలానిన దృష్టిలో ఉంచుకుని మంచినీటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం గ్రామాలల్లో తాగునీటి సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామాలలో గల మిషన్ భగీరథ పైపులైను లీకేజీలు, పైపులైన్ వేయని ఇండ్లకు పైపులైన్ వేయాలని, మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు.ఈ సమావేశంలో సర్పంచులు కర్నాటి అంజురెడ్డి, శాసనాల నాగసైదులు, గల్లా సైదులు, అన్నెం శిరీషాకొండారెడ్డి, శాంతకకుమారి, ఎంపీడీఓ ఎస్కె మౌలానా, ఎంపీఓ ఇంట్రా, గ్రిడ్ ఏఈఈ ఎన్.మహేష్, బి.సిదార్థ, పంచాయతీకార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.