Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ధరణి పోర్టర్లో ఉన్న తప్పులను వెంటనే సవరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ సుధారాణికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతులు కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుందన్నారు.తహసీల్దార్ కార్యాలయం వారు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాలని..ఆర్డీఓ కార్యాలయం వారు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని ,కలెక్టర్ కార్యాలయం వారు ప్రభుత్వ ఆదేశాలు రాలేదంటూ తిప్పుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా రూ.లక్ష రుణమాఫీని, ఇప్పటివరకు అయిన వడ్డీని ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరం మల్లేశ్వరి,పాలకూరిబాబు,బంటు శ్రీనివాస్, గోవర్థన్, జక్కుల రమణ, తదితరులు పాల్గొన్నారు.