Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఆహార భద్రత, తనిఖీ అధికారి కల్యాణ్‌చక్రవర్తి
నవతెలంగాణ-కోదాడరూరల్
పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి కల్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు.శనివారం జిల్లా పరిధిలో ఉన్న పాల విక్రయ కేంద్రాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు.కోదాడలోని వీఎన్ఆర్ , లలిత , హెరిటేజ్ లాంటి పాల కేంద్రాలలో పాల నమూనాలను సేకరించి అప్పటికప్పుడు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించారు. పాల నాణ్యతను పరిశీలించారు.అనంతరం ప్రత్యేక నమూ నాలను తీసుకొని పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ల్యాబ్‌కు పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలను కల్తీ చేసి అమ్మడం చట్ట విరుద్ధమన్నారు.పాలలో నురగ రావడానికి , కొవ్వు శాతం పెరగడానికి ఎవరైనా తప్పుడు పద్ధతులు పాటించకూడదన్నారు.స్వచ్ఛమైన సహజ సిద్ధమైన పాలని అమ్మాలని సూచించారు.ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కొన్ని డెయిరీలో నమూనాలు సేకరించారు.పాలు, పాల ఉత్పత్తులు ఎవరైనా కల్తీ చేసినట్టు తెలిస్తే సమాచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, రతన్‌రావు, విజయ్‌కుమార్, మల్లికార్జున్, ఖాజా, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.