Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
రైతులు ఆయిల్ఫామ్ తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ అధికారి రామారావు,హార్టికల్చర్ ఆఫీసర్ జగన్ అన్నారు.మండలపరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ రైతులకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శనివారం రైతులు డాక్టర్ ఆదుర్తి రామయ్య, విజయలక్ష్మీ, కృష్ణమోహన్ ల ఆయిల్ ఫాం ఉద్యానవన క్షేత్రాన్ని వారు సందర్శించి మాట్లాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆయిల్ఫామ్ సాగును కలెక్టర్ సూచనమేరకు 2500 ఎకరాలలో మొక్కలు నాటాలని నిర్దేశించారన్నారు.అందులో ఇప్పటివరకు 1500 ఎకరాలలో ఆయిల్ఫామ్ మొక్కలు నాట్టడం పూర్తి చేశామన్నారు.ఇంకా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచుటకు రైతులు ముందుకొచ్చారన్నారు.జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ సౌజన్యంతో ప్రతి శుక్రవారం రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు రెండెకరాలపైన ఉన్న భూమిలో బిందు సేద్యంతో ఆయిల్ ఫాం సాగుచేసుకోవచ్చని తెలిపారు.బిందు సేద్య పరికరాలు రాయితీ కేటగిరిని బట్టి ఓసీలకు 80 శాతం, బీసీలకు 90 శాతం, ఎస్సీలకు 100 శాతం వరకు రాయితీ కలదని తెలిపారు.నాలుగేండ్ల పాటు యాజమాన్య చర్యల కోసం అంతర పంటలు సాగు చేసుకున్నందుకు సంవత్సరానికి ఎకరానికి 4200రూపాయల చొప్పున నాలుగేండ్ల పాటు ఇస్తామన్నారు.రూ.193 విలువ గల మొక్క రైతుకు కేవలం 23 రూపాయలకే రాయితీగా వస్తుందన్నారు. ఆసక్తికలిగిన రైతులు ఉద్యాన అధికారులను , పతంజలి ఆయిల్ ఫాం కంపెనీ ప్రతినిధులను గాని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చివ్వెంల వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఏఈఓ పవన్‌కుమార్, పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ డివిజనల్ అధికారులు శశికుమార్, సుధాకర్ డ్రిప్‌ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్ నగేష్, పతంజలి ఆయిల్ కంపెనీ అసిస్టెంట్ వంగూరి లక్ష్మీనారాయణ, భద్రయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.