Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతపల్లి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభివృద్ధిని చూసి ఓర్వలేక, కనీసం పార్టీ సభ్యత్వం లేని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో కలిసి మండలంలో పలు గ్రామాల్లో శిలాఫలకం పగలగొట్టడం ప్లెక్సీలు చింపడం లాంటివి చిల్లర పనులు మానుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి అన్నారు. కేతపల్లి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో అరాచకం చేస్తూ నకిరేకల్‌లో తన అనుచరులతో దందాలు చేస్తూ పార్టీ ప్రతిష్ట దిగజార్చే పనులు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. మళ్లీ చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ చల్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొప్పని సురేష్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.