Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన సైప్తో పాటు ఫిర్యాదు చేసిన పట్టించుకోని కాకతీయ మెడికల్ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ్‌నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బంజారా ఉద్యోగుల సంఘం, బంజారా సంఘం అధ్యర్యంలో సూపరిండెంట్ హాజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేధింపుల విషయమై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోని పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ విద్యార్థి సైప్ వేధింపుల వల్లనే ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకుందన్నారు. వేధింపుల విషయం గత డిసెంబర్ నెలలో పిర్యాదు చేసిన అటు పోలీసులు ఇటు కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం మూలంగా అంత తీవ్ర నిర్ణయానికి ప్రీతీ వచ్చిందని తెలిపారు. సంఘటనకు కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినికే రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. సంఘటనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాలంటే భయపడేలా మరిన్ని కఠిన చట్టాలు తీసుకరావాలని డిమాండ్ చేశారు. ప్రీతికి అత్యుత్తమమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రీతిని బతికించే భాద్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం డివిజన్ నాయకులు లాస్కర్నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు దీరవత్ మాన్యానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠం నాయక్, జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ సైదా నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళియాదవ్, భరత్ రాష్ట్ర సమితి దామరచర్ల మండలం సోషల్ మీడియా కన్వీనర్ సురేష్‌నాయక్, సర్పంచ్ రవీందర్‌నాయక్, అంజయ్య, గోపీనాయక్, మక్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.