Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన ఎస్పీ అపూర్వరావు
నవతెలంగాణ-నల్లగొండ
సెల్ టవర్ సెంటర్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ ఎస్పీ కే.అపూర్వరావు పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కృష్ణ మానస కాలనీ, ఐలాపురం, శ్రీనివాస్ నగర్లలో ఎయిర్టెల్ సెల్ టవర్లలో బేస్ బాండ్, పీఆర్యూల చోరీ విషయంలో సదరు సెల్ టవర్ ఇన్చార్జి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడరూరల్ ఎస్ఐ కేసులు నమోదు చేసుకొని దర్యాప్తులో బాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ధీరావత్ తండాకి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. ధీరావత్ నవీన్, కొత్త సౌమ్య తండాకు చెందిన ధనావత్ కృష్ణ అలియాస్ విష్ణు, ధీరావత్ మోహన్ గత 4, 5 సంవత్సరాలుగా సెల్ టవర్లలో పని చేస్తు సెల్ టవర్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి, సెల్ టవర్‌లో వుండే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్, వాటి విలువ తెలిసి వాటిని గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో సెల్ టవర్లలోకి ప్రవేశించి బీబీయూ, పీఆర్‌యూ, కేబల్లను సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో చోరీ చేసి హైదరాబాద్‌లో ముషీరాబాద్‌కు చెందిన మహమ్మద్ జహంగీర్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రజనీకాంత్ అనే వ్యాపారుల వద్ద పరికరాలను అమ్మి డబ్బు సంపాదిస్తున్నారన్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిపై జిల్లాలోని మిర్యాలగూడ, త్రిపురారం, వేములపల్లి, మాడ్గులపల్లి, నిడమానూర్, తిరుమలగిరి సాగర్, పెద్దవూర, కోండ మల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లి, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ పరిధిలో కూడా సెల్ టవర్ దొంగతనాలపై కేసులు నమోదు అయినట్లు తెలిపారు. టెక్నాలజీ సహాయంతో ఆయా సెల్ టవర్ల వద్ద టవర్ డంప్ ఆధారంగా నిందితుల కదలికలను పరిశీలిస్తూ చోరీలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశామన్నారు. కేసును ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో మిర్యాలగూడరూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ దొరేపల్లి నరసింహులు, సుదీర్ కుమార్, సిబ్బంది నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ కే.శ్రీనివాస్, జీ. రాజారం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అక్బర్, గోపి కేసు చేధించినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు.