Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మెన్ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను వెదజెల్లుతున్నాయని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకాలను నిరుపేద అడబిడ్డలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో షాబునగర్‌లోని ఏఆర్సీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 485 మంది లబ్ధిదారులకు మంజూరైన 4కోట్ల 85లక్షల 56వేల 260 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి పకడ్బందీగా చేపడుతున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా నిలుస్తున్నాయన్నారు. జాతీయ రాజకీయాల్లో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బలమైన జాతీయ పార్టీగా మారనుందని, దీనికి ప్రజా మద్దతే కారణమని అభిప్రాయపడ్డారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ విజయసింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో చెన్నయ్య, ఎంపీపీలు నూకల సరళ హన్మంత్‌రెడ్డి, పోకల శ్రీవిద్య, పుట్టల సునీత కృపయ, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పత్తిపాటి నవాబ్, ఖాదర్, పశ్య శ్రీనివాస్ రెడ్డి, ఉదరు భాస్కర్ రెడ్డి, పునాటి లక్ష్మీ నారాయణ, మోసిన్ అలీ, బీఆర్ ఎస్ జిల్లా నాయకులు మధార్ బాబా, అన్నభీమోజు నాగార్జున చారి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.