Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
హెచ్సీయూ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఫ్యానల్ ఘన విజయం సాధించిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ గెలిపొందిన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ కూటమి కూటమి ఏబీవీపీ కూటమిపై ఘన విజయం సాధించిందన్నారు.ఈ విజయంతో విశ్వవిద్యాలయాలలో మత రాజకీయాలకు స్థానం లేదని విద్యార్థులు నిరూపించారన్నారు.నూతన విద్యావిధానం పేరుతో విద్యాకేంద్రీకరణ, కార్పొరేటీకరణ, యూనివర్శీటీల స్వయం ప్రతిపత్తి, ఫెలోషిప్ నిలుపుదల, జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ పరీక్షలకు సీయూఈటీ లాంటి విధానాలు గురించి విద్యార్ధి సంఘం ఎన్నికల్లో ప్రధానంగా విద్యార్ధులో ఎస్ఎఫ్ఐ కూటమి చర్చించిందన్నారు.గత ఎన్నికల్లో ఇదే కూటమితో ఎస్ఎఫ్ఐ ముఖ్య భూమిక పోషించి విజయం సాధించిన ఎస్ఎఫ్ఐ, వరుసగా రెండవ సారి విజయం సాధించిందన్నారు. సంఘం అని అన్నారు. విద్యారంగ సమస్యలపై దేశ వ్యాప్తంగా రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యావ్యతిరేక విధానాలపై ఈ విజయ స్ఫూర్తితో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శలు ఈర్ల రాహుల్, చింతల శివ, జిల్లా సహాయ కార్యదర్శి సందెల రాజేష్, పట్టణ నాయకులు ఈర్ల కార్తీక్,శివ నగరం శివ, రహన్లు పాల్గొన్నారు.
వలిగొండ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూని యన్ ఎన్నికలు జరుగగా ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి ఘన విజయం సాధించిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు తెలిపారు .మండలకేంద్రంలోని ఎస్ఎఫ్ఐ నాయకులు స్వీట్స్ పంచుతూ నినాదాలు చేస్తూ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎఫ్ఐ మండల సహాయకార్యదర్శి పోలేపాక విష్ణు,బుగ్గ ఉదరు కిరణ్,నాయకులు మనోజ్,ఉపేందర్,రాకేష్,రంజిత్,శివ,వేముల విష్ణు,శ్రీకాంత్, మణికంఠ,రోహన్,తదితరులు పాల్గొన్నారు.