Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్:భువనగిరి జిల్లాకేంద్రంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.వివరాలను పరిశీలిస్తే భువనగిరి జిల్లా కేంద్రంలోని సమ్మ చౌరస్తా నుంచి జంకాన గూడ చౌరస్తా వరకు అండర్‌గ్రౌండ్ డ్రయినేజీలుకొనసాగుతూ ఉండడంతో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, భువనగిరి ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి నాలుగురోజులుగా పనులను చేయిస్తున్నారు.కాలనీలోని ప్రజ లకు ఇబ్బందులు కలగకుండా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు జరిగే ప్రదేశం వద్ద ఉంటూ పనులను వేగవంతంగా చేస్తున్నా రు.అండర్గ్రౌండ్డ్రయినేజీ వేసే సందర్భంలో నాణ్యతా లోపం ఉండకు ండా స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ ఇంజనీర్ అవతారమె త్తారు.ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, నాయకులు గుండెబోయిన సురేష్‌యాదవ్, ఉమా మహేశ్వర్, కాలనీవాసులు ఉన్నారు.