Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆదివారం మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నేటికీ ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలిస్తామన్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన9 ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమేనన్నారు.హామీలు నెరవేర్చకపోవడం మోసపూరితమైన మాటలని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఇదిగో అని అదిగో అని బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పడం తప్ప నేటికీ రైతులకు రుణమాఫీ కాలేదని కొత్త రుణాలు తీసుకుందామంటే బ్యాంకుల్లో రైతులకు రుణాలు ఇవ్వడం లేదని అడుగడుగునా రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్ ధర కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 400 రూపాయలు ఉన్న సామాన్యుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1150 సిలిండర్ ధర ఉంటే సామాన్యుడు ఎలా బతుకుతాడని ఆవేదనతో ఉంటున్నారన్నారు.తమ పార్టీ అధికారంలోకి రాగానే సిలిండర్ ధర రూ.500 దొరుకుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీపాల్‌రెడ్డి , నాగరాజు, దీప, శంకరయ్య, దశరథ, నర్సింహులు,కిష్టయ్య, భిక్షపతి, అనిత తదితరులు పాల్గొన్నారు.