Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టిందంటే పిక్క పీకాల్సిందే..!
- విధుల్లో వీధికుక్కలహల్చల్
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలో పిచ్చికుక్కల స్వైరవిహారం చేస్తున్నాయి. మండలంలోని మర్యాల గ్రామంలో పిచ్చికుక్కల విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను కరుస్తూ గాయాలపాలు చేస్తున్నాయి.పిచ్చికుక్కలు విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.రాత్రి అయితే ఎటు నుంచి ఏ పిచ్చికుక్క వచ్చి కరుస్తుందోనన్న భయం ప్రజలకు వెంటాడుతుంది.సరైన ఆహారం లభించక కొన్ని కుక్కలు, మాంసం వ్యర్ధాలకు అలవాటు పడిన మరికొన్ని కుక్కలు జనాలను వెంటపడి కరుస్తున్నాయి.శనివారం గ్రామంలోని ముగ్గురు వ్యక్తుల మీద పిచ్చికుక్క వీరంగం సృష్టించింది.రెండు రోజులుగా పిచ్చికుక్క గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతూ పలువుర్ని గాయపరుస్తుండగా ప్రజలు భయపడుతున్నారు.పిచ్చికుక్కలను వెంటనే గ్రామ యువకులు కట్టలతో శనివారం రాత్రి ఊరంతా తిరిగి గాలించారు.ఊరంతా తిరిగిన దొరకకపోవడంతో గ్రామస్తులంతా కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు, పిచ్చికుక్క రెండు మూడు కుక్కలను కరవడంతో పిచ్చెక్కిన కుక్కలు గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.రెండు రోజులు వ్యవధిలో ముగ్గురు మీద దాడి చేశాయి.త్వరగా సమస్యను పరిష్కరిం చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటపడి కరుస్తున్న కుక్కలు..
ఇంటి నుండి బయటకు వస్తే చాలు, ఎక్కడ నుండి ఏ పిచ్చికుక్క వస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు. గ్రామంలో ఇటువంటి కాలంలో కుక్కలు పెడితే బాగా పెరిగింది. నెల రోజుల క్రితం మూడేళ్ల వయసున్న చిన్నారిని దవడ తీవ్రంగా గాయపరిచాయి. పిచ్చికుక్కను వెంటాడిన గ్రామస్తులు చంపేశారు. అమ్మ పీడ విరగడయింది అనేసరికి మళ్ళీ మొదలైన పిచ్చి కుక్కలు, మాంసాహారానికి అలవాటు పడ్డ కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.వాటి నివారణకు, నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వాటి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నది.గ్రామంలో చికెన్, మటన్ దుకాణదారులు మాంసం వ్యర్థాలను ఇష్టానుసారంగా రోడ్ల వెంట, చెరువు కట్ట, వాగుల్లో పొడుస్తున్నడంతో కుక్కలు వాటిని తింటూ మాంసానికి అలవాటు పడుతున్నాయి.దాంతో మాంసానికి అలవాటు పడిన వీధికుక్కలు ప్రజల వెంట పడుతూ కరుస్తున్నాయి.త్వరగా సమస్యను పరిష్కరించాలని పలువురు వేడుకుంటున్నారు.
కుక్కల, భారీ నుంచి కాపాడాలి
ముద్దం శశిధర్రెడ్డి, మర్యాల
పిచ్చికుక్కలు బారిన నుంచి ప్రజలనుకాపాడాలి.కుక్కలబెడద బాగా పెరిగింది.కుక్కలు వృద్ధులు, మహిళలను వెంటపడి కరుస్తుండడంతో తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా పాఠశాలకు, కిరాణా షాపులకు పంపడానికి భయపడుతున్నారు.చికెన్, మటన్ దుకాణ పడేసి వ్యర్ధాలను తిని కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.అధికారులు త్వరగా స్పందించి ప్రజలకు విముక్తి కల్పించాలి.