Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ రామకృష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
ఆయిల్ఫామ్ సాగుపై రైతులు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ఆయిల్ ఫాం తోటలు పెట్టేందుకు రైతులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలో రైతు కట్కూరి గిరిధర్‌రెడ్డి 12 ఎకరాల స్థలంలో ఆయిల్ ఫాం మొక్కలు నాటుతుండగా ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కనాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట నూనెల ఉత్పత్తిలో ఆయిల్ ఫామ్ సాగు ఎంతో ముఖ్యమని గుర్తించి సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రైతులకు సాగుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. నీటి వసతి ఉంటే చాలా తక్కువ పెట్టుబడితో ఆయిల్తోటలు సాగు చేయవచ్చన్నారు.మొక్కల పంపిణీ నుంచి డ్రిప్ కోసం, మూడేండ్ల వరకు ు పలు రకాల ప్రోత్సాహాకాలు అందిస్తున్నామన్నారు.మొక్కలు నాటిన మూడేండ్ల నుండి 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుందన్నారు.మార్కెట్లో కూడా ఆయిల్ గెలలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయిల్ ఫాం సాగుకు రైతుల నుంచి మంచిస్పందన వస్తుందన్నారు.తన స్వంత జిల్లా యాదాద్రి జిల్లాలో కూడా సాగును పెంచాలన్న లక్ష్యంతో ప్రత్యేక కృషితో మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి 3 లక్షల మొక్కలు పెంచుతున్నామన్నారు.ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కోసం డైరీలు కూడా ముద్రించి అందజేస్తున్నట్టు తెలిపారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, కూరెళ్ల కుమారస్వామి, ఆయిల్‌ఫెడ్ జిల్లా అధికారి ప్రవీణ్, ఫీల్డ్‌ఆఫీసర్ మమత, నాయకులు చేతరాశి వీరస్వామి, మలిపెద్దిరాంరెడ్డి, యశ్వంతాచారి, తాడూరి గోపిరెడ్డి, అనంతరాంరెడ్డి, కృష్ణారెడ్డి, రాములు, సోమయ్య, చింతల చిన్నవెంకట్‌రెడ్డి, మల్లయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.