Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్
ప్రజా,కార్మిక,కష్టజీవుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,బడా కార్పోరేట్ సంస్థలకు సేవకులుగా మారారని ఐఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్దన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గంటా నాగయ్య,హమాలీ రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి లు అన్నారు.యాదగిరిగుట్ట మండలం మల్లా పురం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా 3 వ,మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు, మల్లాపురం హమాలీ యూనియన్ అధ్యక్షుడు,మాటూరి లాలయ్య అధ్యక్షతన జరిగింది.మహాసభకు ముందు యూనియన్ జండాను లాలయ్య ఎగురవేశాడు.
అనంతరం మహాసభ కార్మికోద్యమంలో అసువులు బాసిన బరిగే ఆంజనేయులు తదితర అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడికుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బర్మబాబు,హమాలీ యూనియన్ నాయకులు మోటే శ్రీశైలం, పుర్మ నర్సింహులు,కర్రె స్వామి, పుర్మ చంద్రయ్య, నాయిని మైసయ్య, తోకల నర్సింహులు, ఊరడి రామ చంద్రు, బరిగే నదార్, శామల లక్ష్మీ నరసయ్య, మోటే రాజయ్య, పుర్మ సిద్దులు, కర్రె సిద్దులు,ఉడుత మల్లేష్, పుచ్చుల నారాయణ, వడ్లకొండ బాలరాజు, జామచెట్టు వెంకట్,జిల్లా సంతోష్, ఇప్ప భిక్షపతి, సుంచు రాములు,ఓరుగంటి మై సయ్య, కాకళ్ళ కనకయ్య,రంగ కనకయ్య, బుగ్గ నర్సింహులు, కర్రె బాలయ్య,తదితరులు పాల్గొన్నారు.