Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఆరోరోజుకు చేరుకున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిత్యారాధనల అనంతరం లక్ష్మీ నరసింహ స్వామిని గోవర్ధన గిరిధారిగాగా అలంకరించి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయనీకులు అత్యంత వైభవంగా ఆలయ ప్రాకారంలలో ఊరేగించారు.భగవానుడు శ్రీ కృష్ణావతారంలో ఎన్నో విలక్షణమైన లీలలు సందర్శించవచ్చు వా అపూర్వమైన లీల గోవర్ధనగిరి ధారి లీల. భగవానుడు ఇంద్రుని అహంకారాన్ని తొలగించి, తనను ఆశ్రయించిన భక్తులను కాపాడిన తీరు ఈ లీలలో దర్శించవచ్చు.ఏడు రోజులు ఏకధారగా కురిసే వర్షము నుండి గోవులను, గోపకులను రక్షించుటకు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుపై ధరించెను. పరమాత్మ లీలను దర్శించిన ఇంద్రుడు తన గర్వాన్ని వదిలి శరణాగతి కోరెను. శ్రీ స్వామి వారు గోవర్ధనగిరి ధారి అలంకరణ సేవలో ఆశ్రితజన రక్షణ తత్పరతను తెలియజేయునని తెలిపారు.ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహామూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆనంద శంకర్జయంత బృందంచే భరతనాట్య ప్రదర్శన, మంగళ బట్ బృందంచే కథక్ నృత్య ప్రదర్శన, మల్లాది బ్రదర్స్ కర్నాటక గాత్ర కచేరి నిర్వహించారు.