Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీ ఉదరురెడ్డి
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని పోచంపల్లి ప్రధాన రహదారి మధ్యలో అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ఏసీపీ ఉదరురెడ్డి హెచ్చరించారు.ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విగ్రహ కమిటీ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.రోడ్డు మధ్యలో పెట్టినట్టయితే ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.పద్మశాలి బహుజన సంఘం నేతన్న విగ్రహం,గౌడన్న సంఘం సర్దార్ పాపన్నవిగ్రహం, ఎరుకల సంఘం ఏకలవ్యుడు విగ్రహం,బహుజన సంఘం జ్యోతిరావు బాపులే విగ్రహం ,వామపక్ష పార్టీలు పుచ్చపల్లి సుందరయ్య విగ్రహాన్ని పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టుటకు ప్రయత్నిస్తునారని తెలియడంతో ఆయా విగ్రహ కమిటీల సభ్యులకు పోచంపల్లి ఎస్సై సైదిరెడ్డి, చౌటుప్పల్‌రూరల్ సర్కిల్సీఐ టి.మహేష్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.