Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
ధరల పెరుగుదల, మతోన్మాదం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందని, ఈ ప్రజా ఉద్యమాల నిర్వహణకు ప్రజలంతా సహకరించి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి పట్టణకేంద్రంలో నిర్వహించిన ఇంటింటికి సీపీఐ(ఎం) మెగా క్యాంపెయిన్ కార్యక్రమంలో జహంగీర్ పాల్గొని మాట్లాడారు.ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు భువనగిరి పట్టణకేంద్రంలో ఇంటింటికి సీపీఐ(ఎం) మెగా క్యాంపెయన్ నిర్వహిస్తుందన్నారు.జిల్లాలో పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు.జిల్లా ఏర్పడిన ఏడేండ్ల కాలంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం,సాగు,తాగునీటి సాధన కోసం, వ్యవసాయ కూలీ, రైతాంగ సమస్యలు, మహిళా, కార్మిక హక్కుల రక్షణ కోసం, విద్యా, వైద్యం,ఉపాధి సదుపాయాలతో పాటు, సామాజిక న్యాయం, వృత్తిరక్షణ, మూసి ప్రక్షాళన,భూ నిర్వాసితుల సమస్యలపై ఉవ్వెత్తిన ఉద్యమాలు జరిపామన్నారు.రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పాలకులు అనేక వాగ్దానాలతో అందలమెక్కారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు.జిల్లాలో నత్తనడకలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్ పనులు, పాలమూరు,, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు అతిగతి లేని గంధమల్ల రిజర్వాయర్, అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ ,ధర్మారెడ్డిపల్లి కాలువలో మోసి ప్రక్షాళన,వివిధ కాలువలను గోదావరి జలాలకు అనుసంధానం, అరకోర వసతులతో ఉన్న ఎయిమ్స్, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల, ఆలేరులో ఆర్డీవో కేంద్రం, భూనిర్వాసితుల సమస్యలు ,రామన్నపేటు భువనగిరి నాలుగులైన్ల రోడ్డు, ఇండ్లు ,ఇంటి స్థలాలు, పెన్షన్లు, ప్రాణాలను హరిస్తున్న కాలుష్యం ఇలా అనేక సమస్యలు జిల్లాల్లో ఉన్నాయన్నారు.కార్యక్రమంలో అధ్యయనం చేసిన సమస్యలపై మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రజా పోరాటాలకు పార్టీ సిద్ధమవుతుందన్నారు.ఈ పోరాటాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ఉద్యమ నిర్వహణకు ఆర్థికంగా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ,బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కల్లూరు మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,పైళ్ల లింగారెడ్డి, మాయకృష్ణ ,దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి ,గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి రేకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, బండారు శ్రీరాములు, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, బోడభాగ్య, మంచాల మధు, కోట రామచంద్రారెడ్డి, గాడిశ్రీనివాస్, తీగల వెంకటేష్, దొడ్డి భిక్షపతి,గంధమల్ల మాతయ్య, పల్లెర్ల అంజయ్య, కొండ అశోక్, కొండాపురం యాదగిరి ,బందెల ఎల్లయ్య, కూకుట్ల కృష్ణ, వడ్డెబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.