Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన యరమాల చిరంజీవి చిరు వ్యాపారం కిరాణా దుకాణాన్ని ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని, చిరు వ్యాపారమే చింతలేని వ్యాపారమని యారమాల చిరంజీవి వ్యాపారం దినదినాభివృద్ది సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ యరమాల క్రాంతికుమార్, మండల యూత్ అధ్యక్షులు కంచుకంటి గోపి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కలకొండ బాలకృష్ణ, హ్యూమన్ రైట్స్ కమీషన్ ఇన్చార్జి గోసు గోపీనాథ్, యూసుఫ్ సార్ తదితరులు పాల్గొన్నారు.