Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఈనెల 28న ఇంద్ర పార్క్లో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల మహాసభను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ యాకూబ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంఎస్ భవన్లో జీపీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలను అందజేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే కాంటాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల కాలం గడిచినా పర్మినెంట్ చేయకపోవడం విడ్డ్డురమన్నారు.ఈ కార్యక్రమంలో రాజు, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, ఇసాక్, ముత్యాలమ్మ, వెంకటరత్నం, దామోదరచారి, రాజలింగం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.