Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముప్పారపు నరేందర్ అన్నారు.ఆదివారం స్థానిక బేబీమూన్ పాఠశాలలో పద్మశాలి యువజన సంఘం, గ్రీన్ క్లబ్ ట్రస్ట్, ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో డయాగస్టిక్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటిక్, కొలెస్టరాల్ పరీక్షలను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మనిషి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.శారీరక శ్రమ, వ్యాయామం చేయక పోవడం వలన సూర్యరశ్మి లోపం వలన అనారోగ్యం పాలవుతున్నామని పేర్కొన్నారు. వ్యాధి నిర్దారణ పరీక్షల వల్ల వచ్చే వ్యాధులను ముందుగానే పసికట్టి జాగ్రత్తగా ఉంటూ తగిన వైద్యం పొందే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఐదు ఉచిత పరీక్షల శిబిరాల్లో సుమారు 2000 ల మంది వరకు పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు.మహిళా దినోత్సవం సందర్భంగా తక్కువ ధరకే మహిళలకు డి విటమిన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ పెండెం చంద్రశేఖర్, గ్రీన్క్లబ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముప్పారపు నరేందర్,సెక్రెటరీ డాక్టర్ తోట కిరణ్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, పద్మశాలి సంఘం నాయకులు ఎలగందుల సుదర్శన్, పున్న వెంకన్న, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మిట్టకోల యుగందర్, మిట్టపల్లి రమేష్, ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు దూలం నగేష్, అనంతుల రాజేశ్వర్ రావు, అపోలో డయాగస్టిక్ నిర్వాహకులు గంజి రామ్ చరణ్, రాపోలు సంతోష్, కుక్కడపు సాలయ్య, సందీప్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.