Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలోని గ్రీన్వుడ్ పాఠశాలలో ఐదవ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్స్టోరియల్ ఆఫీసర్ జనార్ధన్, ఎంఈఓ సైదానాయక్, మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, డాక్టర్ శివప్రసాద్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ థామస్‌రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలలో విద్యతోపాటు ఆటపాటల్లోనూ సాంస్కృతిక రంగంలోనూ, మారుతున్న సాంకేతిక పరిస్థితులలో అన్ని రంగాలలో ముందుండాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం పాఠశాలలు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన విద్యార్థులకు గ్రీన్ బోర్డు పాఠశాల చైర్మెన్ తుమ్మ సరిత మరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏవీ.రావు, ప్రిన్సిపల్ రాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.