Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నాయకత్వం మీద పెరుగుతున్న విశ్వసనీయత
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశ రాజకీయాలలో భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో 2014 నుండి జరుగుతున్న అభివృద్ధి ,అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటు వైపే చూస్తుందన్నారు.కాంగ్రెస్ నేత, ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ కమిటీ పోరాట సమితి అధ్యక్షుడు ఎండి. ఖాలేద్ అహ్మద్ ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమ తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అదే పనిగా ఉదర గొడుతున్న బీజేపీ ఎలుబడిలోని కర్నాటక రాష్ట్రంలో ఈ డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ వైస్‌చైర్మెన్ వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, 21వ వార్డు ఇన్చార్జి రహీం (పిల్లు), మున్సిపల్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, సీనియర్ నాయకులు సయ్యద్ సలీం, బైరు వెంకన్నగౌడ్, మద్ది శ్రీనివాస్‌యాదవ్,గౌస్‌ఖాన్,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.