Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని,కార్యకర్తల కుటుం బాలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.ఆదివారం మండలపరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త మల్లెపాక దయాకర్ ప్రమాదంలో చనిపోయి నందున,అతని భార్య పూలమ్మకు రూ.2 లక్షల బీమాచెక్కును అందజేసి మాట్లాడారు.ఈ మేరకు పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే,వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాదబీమా సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.అభివృద్ధిలోనే కాకుండా పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పరితపించే బీఆర్ఎస్ అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలఅధ్యక్షులు తాటికొండ సీతయ్య,వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్,సర్పంచ్ నకిరేకంటి విజరు,మెంతబోయిన సింహాద్రి, గ్రామ అధ్యక్షులు వగలగాని లింగయ్య,అయోధ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.