Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాస్ పుస్తకాల మంజూరులో అధికారుల జాప్యం
నవతెలంగాణ-మిర్యాలగూడ
భూ కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించాలని బాధితులు తాహేరా బేగం, సాబెర్ బేగం, లతిఫా బేగం, నస్రీన్ సుల్తానాలు కోరారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రకాష్ నగర్ కాలనీ సర్వే నెం. 803లో తమకు 2.38 గుంటల భూమి ఉందని, అందులో 0.38 గుంటలు ఎన్నెస్పీ కెనాల్ కోసం పొగా మిగిలిన 2 ఎకరాలకు అవార్డు కూడా పొందినట్లు తెలిపారు. సర్వే నెంబర్ 802లో మందుల ఎల్లయ్యకు భూమి ఉంటే అతను వేరే వారికి అమ్ముకున్నడని, ఇప్పుడు తన సర్వే 803 లో భూమి ఉన్నట్లు సృష్టించి మా భూమిని అక్రమించుకోవలని చూస్తున్నారని ఆరోపించారు. మందులు ఎల్లయ్య, మందుల అశోక్, సమీర్లు మారుతిరావు గ్యాంగ్‌తో కలిసి భూమిని కబ్జా చేయాలని చూశారని, మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారించి వారిపై కేసు నమోదు చేశారని తెలిపారు. మా భూమి విషయంపై ఆర్డీఓకు సంప్రదిస్తే ధరణిలోనీ పేరే ఉన్నదని పట్టా చేసుకోవాలని సలహా ఇచ్చారని, వారి సూచన మేరకు తహశీల్దార్‌ను కలిసి పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకుంటే పాస్ బుక్ ఇవ్వకండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్‌బుక్ ఇస్తానంటున్నారని కానీ ఇవ్వటం లేదని, దీనికి కౌన్సిలర్ మలగం రమేష్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రికార్డు పరంగా తమకే అన్ని హక్కులు ఉన్నపటికీ తహసీల్దార్ పాస్ పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లినంత మాత్రాన తమ భూమి కబ్జా చేయడం అన్యాయమని తెలిపారు. వెంటనే మాకు పాస్ బుక్‌లు ఇవ్వాలని, ఉన్నతధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.