Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఏపీ లింగోటం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ రైతుబంధు, రైతు భీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఏపీ లింగోటం గ్రామంలో మట్టి లేని రోడ్లను చేయడం లక్ష్యంగా ఇప్పటికే 60 లక్షల రూపాయలు వెచ్చించామని చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని త్వరలోనే 20 లక్షల రూపాయలతో పనులు మొదలు పెట్టనున్నట్లు పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ నూకల శంకర్, ఎంపీటీసీ బొక్క కనకమ్మ భూపాల్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెగోని యాదగిరిగౌడ్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పాలమోహన్, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.