Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
దేశంలోని అన్ని రాష్ట్రాలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి కమిటీలు ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మరమైన కేశవులు అన్నారు. ఆదివారం ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంగా 2009లో ప్రారంభమైన సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా రాష్ట్ర జాతీయస్థాయిలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. మార్చి1న దేశ రాజధాని ఢిల్లీలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మెన్‌గా ప్రమాణ స్వీకారు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సామన్యుడిని చైతన్యం చేయడంతో పాటు అవినీతి పై పోరాటం చేసేందుకు, ప్రశ్నించే గొంతుకలను తయ్యారు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నేడు నల్లగొండ సంచార హక్కు పరిరక్షణ సమితి కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరుతున్న ర్యాలీనీ రెవెన్యూ డివిజనల్ అధికారి జయచంద్రారెడ్డి, డీఏస్పీ నర్సింహారెడ్డిలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ కమిటీ సభ్యుడు కోట్ల రామలింగం, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండమీది అంజయ్య, రాష్ట్ర నాయకురాలు జినుగు జ్యోతిరెడ్డి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ సదాలక్ష్మి, యాట మల్లయ్య, జిల్లా నాయకులు తిరునగరి శ్రీనివాసరావు, ప్రభాకరరెడ్డి, మేకల శ్రీహరి, జీనుగు వెంకటరెడ్డి, గాదె ప్రణయ్ కుమార్, భోనగిరి సందీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.