Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ జిల్లా అధ్యక్షులు సీహెచ్. లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
విశాలా భారతదేశమంతటా ఎస్ఎఫ్ఐదే విజయబావుటని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు సీహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎలక్షన్లలో అన్ని ప్యానల్లో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించడం పట్ల ఆదివారం నల్లగొండ పట్టణంలో మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో లౌకికవాద కూటమి ఎస్ఎఫ్ఐ అన్ని ప్యానల్లో గెలుపొందడం చాలా మంచి పరిణామం అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలోకి కాషాయికరణ మతోన్మాద భావజాలాన్ని జోప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఎస్ఎఫ్ఐ కూటమి ఈ కుట్రను తిప్పి కోట్టి విశ్వవిద్యాలయంలో మతోన్మాదానికి తావు లేదని నిరూపించారు. అందరు కలిసి మెలసి వుండే యూనివర్సిటీలను ఏబీవీపీ మతఘర్షణ కేంద్రాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోతుందనే అక్కసుతో హెచ్సీయూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై ప్రత్యక్ష దాడులకు దిగిందన్నారు. ఏబీవీపీ తాటాకు చప్పుళ్ళకు ఎస్ఎఫ్ఐ వెనుకడుగు వేయదని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లోకం ఓటమితో ఏబీవీపీకి గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ గెలుపు స్పూర్తితో బీజేపీ తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విజయఢంకా మోగించడం కోసం సహకరించిన విద్యార్థిలోకానికి నల్లగోండ జిల్లా కమిటీ పక్షాన విప్లవాబివందనాలు తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషీం, నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, బిట్టు, రేణుక, అశోక్, యువరాజ్, కళ్యాణ్ , సంపత్, నందిని, తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు : విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్ కంభంపాటి శంకర్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎలక్షన్లలో అన్ని ప్యానల్లో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించడం పట్ల ఆదివారం మునుగోడు బీసీ బాలికల హాస్టల్లో మిఠాయి పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి,అఖిల, దీపికా, సోని, కల్పన, నందిని తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : సెంట్రల్ వర్సిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం స్థానిక బాలికల హాస్టల్లో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు వదుద్, దామరచర్ల కార్యదర్శి వీరన్న, మనోహర్, రవి, మహేష్, తరుణ్, సమధ్, ఉపేందర్, ఇందుమతి, అంజలి, స్రవంతి, కార్తీక, సింధు, రజిత, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎలక్షన్లో అన్ని ప్యానల్లో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించడం పట్ల అనందం వ్యక్తం చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దామరచర్లలో ఆదివారం బాణసంచా కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనునాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, రవి, శ్రీకాంత్, సర్దార్, చంటి, నవీన్ సర్దార్, నరసింహారావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.