Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ చక్రధర్‌రావు
నవతెలంగాణ-నల్లగొండ
నూతన జాతీయ విధ్యా విధానం 2020 భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి, భారత జీవన విధానానికి, బిన్న సంస్కృతులకు విరుద్దమని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కే.చక్రధర్‌రావు అన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి అధ్వర్యంలో ఆదివారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ''నూతన జాతీయ విద్యా విధానం 2020'' పై జిల్లా గౌరవాధ్యక్షులు ఆర్.విజరుకుమార్ అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానంపై కేంద్రం కమిటీలు వేయడం, కమిటీలు ఇచ్చిన రిపోర్టును పక్కకు పెట్టడం, పార్లమెంట్లో చర్చకు పెట్టకుండా క్యాబినెట్ ఆమోదించడం ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమన్నారు.సెక్యులర్ విద్యను ప్రోత్సహించకుండా జ్యోతిష్యం, భగవద్గీతకు సంబంధించిన మత మౌడ్య కోర్సులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంధన్నారు. కేంద్రం వేసిన కమిటీలో విద్యా రంగానికి సంబంధించిన విద్యారంగ నిపుణులు లేరన్నారు. అంతా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృంధమే ఉంధన్నారు. వారికి విధ్యా విధానాలపై అవగాహన లేదని తెలిపారు. అలాంటి విధానాలు ఈ దేశ పరిస్థితులకు అనువైనవి కావన్నారు.
సామాన్యులకు అంధని ద్రాక్ష
ప్రొఫెసర్ లక్ష్మినారాయణ
విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం..కాని రాష్ట్రాల ఆలోచనలను, యూనివర్సిటీ ప్రొఫెసర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలనుగాని పార్టీల అభిప్రాయాలను గాని కనీసం చర్చ కోసం కూడా యూనివర్సిటీలకు కూడా పంపలేదన్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించి అమలులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంధన్నారు. పాలకులు ప్రజల ఆకాంక్షల వెలుగులో విధానాలు రుపొందించకుండా..వారి ప్రయోజనాల కోసం రుపొందిస్తున్నారన్నారు. ఈ జాతీయ విద్యా విధానంతో ప్రయివేటీకరణ, కార్పోరేటికరణ, కాషాయికరణ పెరిగిపోయి సామాన్య విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంధన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, మానవ హక్కుల వేదిక బాధ్యులు గోసుల మోహన్, విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు పీ.వెంకులు, ప్రధాన కార్యదర్శి కే.రత్నయ్య, కస్తూరి ప్రభాకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, కే.పర్వతాలు, జ్వాలా వెంకటేశ్వర్లు, ఇందూరి సాగర్, పందుల సైదులు, కొండేటి మురళి తదితరులు పాల్గొన్నారు.