Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ భువనగిరి రూరల్
విద్యా సంస్థల్లో పర్యవేక్షణ కమిటీలు, టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కోరారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రిన్సి చౌరస్తా వద్ద మేడికో డాక్టర్ ప్రీతిని వేధించిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడిసిన్ డాక్టర్ ప్రీతి సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి మృతి పట్ల సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో రాగింగ్ సీనియర్ల వేధింపులు,పనిఒత్తిడి, కారణాలవల్ల విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.నిన్న వరంగల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తోటి విద్యార్థులు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తుందనారు. ప్రతి విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు చేయాలనే, 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం, 2009లో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ ఈ కృషి జరగడం లేదనారు. 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 32 ర్యాగింగ్ కేసులు యూసీజీకి వచ్చినట్టు స్వయంగా కేంద్రం మానవ వనరుల శాఖనే పేర్కొన్నదని, ఎంతో ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతుందన్నారు.ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, ఎంతో కొంత ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచడం లేదన్నారు.విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యు జి సి ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించాలని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయన నెంబర్లను బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.ప్రతి విద్యా సంస్థల్లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులతో పాటు సైక్రాటిస్టు ,సైకాలజిస్టులను కూడా భాగస్వాములను చేసి తరచుగా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ,దయ్యాల నరసింహ, మాయ కృష్ణ ,గంగదేవి సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, సిర్పంగి స్వామి, దోడ యాదిరెడ్డి, గుండు వెంకట్ నర్సు ,గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్, మండల కార్యదర్శులు దూపటి వెంకటేష్, రేకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, బండారు శ్రీరాములు, వేముల భిక్షపతి, నాయకులు తుర్కపల్లి సురేందర్, చీరిక సంజీవరెడ్డి ,గాడి శ్రీనివాస్, ప్రసాదం విష్ణు లు పాల్గొన్నారు.