Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సంత్ సేవాలాల్ మహారాజ్ బోధించిన ఆశయాలను మనం ఆచరణలో చూపాలని, బంజారా జాతి విద్య, సామాజికపరంగా ఇంకా ఎదగాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు.సోమవారం భువనగిరి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 284 జయంతి వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవాలాల్ వారి ఆశయాలను, ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో చూపాలన్నారు.బంజారా ప్రజలలో మహిళలు సాధికారికంగా ఉండాలని, తండాలలో విద్యాపరంగా ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.మనం ఆర్ధిక పురోగతిని వెనుకబాటుతనానికి వాడుతున్నామని, ఇది మారాలన్నారు.ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు తమ తోటి వారిని పైకి తేవాలని, జిల్లాలో గిరిజన అధికారులు సామాజిక అభివృద్ధి అంశాలలో చొరవ తీసుకోవాలన్నారు.సంత్ సేవాలాల్ చూపిన ఆశయాలను అందరి సహకారంతో సాధించాలని, గిరిజన జాతి అభ్యున్నతికి పాటుపడాలన్నారు.డిిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ, చదువుతోనే ఏ జాతి అయినా బాగుపడుతందన్నారు.చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలని, అభివృద్ధి చెందిన వారు మిగతా వారి ఉన్నతికి పాటుపడాలని, తండాలను వదిలి వెళ్లవద్దన్నారు. సెలవులలో తండాలకు వెళ్లాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భికూ నాయక్ మాట్లాడుతూ, బంజారా జాతి సేవాలాల్ చూపిన విధంగా ఏకతాటిపై ఉండాలని, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలన్నారు.ఆయన ఆశయాలను సాధించి బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు.జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యానాయక్, జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, ఆలిండియా బంజారా సేవా సంఫ్‌ు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ్లాల్, కేతావత్ సోమ్లానాయక్, 31 వార్డు కౌన్సిలర్ వెంకట్ నర్సింగ్‌నాయక్ సంత్ సేవాలాల్ ఆశయాలను, బంజారా జాతి ఔన్నత్యాన్ని వివరించారు.అనంతరంసంత్ సేవాలాల్ మహరాజ్ వారి చిత్రపటానికి పూలమాలలలేసి అంజలిఘటించారు.తదనంతరం నిన్న మరణించిన ధరావత్ ప్రీతి మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు.జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఇన్చార్జి,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి వందన సమర్పణ గావించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, బీబీనగర్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జెడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షులు అమరేందర్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు అమరేందర్‌గౌడ్, జిల్లా ట్రెజరీ అధికారి సురేష్ పాల్గొన్నారు.