Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్న గారి మాణిక్‌రెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
విద్యా రంగ అభివృద్ధి కోసం,ఉపాధ్యాయ ఆధ్యాపకుల సమస్యలను ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ బలపరిచిన మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు,జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ, అధ్యాపకులతో మాట్లాడారు.ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపై సంపూర్ణంగా అవగాహన తనను గెలిపించాలని కోరారు.తనను గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు.తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈయన వెంట టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మిరియాల దామోదర్,ముక్కర్ల యాదయ్య,జిల్లా కార్యదర్శి బొమ్మ గోని ముత్యాలు,పి. వెంకట్‌రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి శేఖర్,నాయకులు కొత్త కోటేశ్వర్,పీ. మోహన్ రెడ్డి,ఎస్.జ్ఞానేశ్వర్ రెడ్డి,లెనిన్,అంజయ్య, ప్రభాకర్,త్రివేణి,ప్రసాద్, టిఎస్ ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్,సోమిరెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్:విద్యారంగా అభివృద్ధి, ఉపాధ్యాయ, అధ్యాపకుల సంక్షేమం కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి శాసనమండలి ఉపా ధ్యాయ టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి కోరారు.మండలంలోని తుప్రాన్పేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంపై పూర్తి అవగాహన ఉండి, ఎన్నో ఏండ్లుగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతున్నాని అన్నారు.టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక సమస్యలపై పోరాటం నిర్వహించి ఉపాధ్యాయ హక్కులను కాపాడాలని తెలిపారు. కస్తూరిబా స్కూల్, మోడల్, గురుకులాల సమస్యలపై నిర్వహించే ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్య ఉంటూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయుల ప్రతినిధిగా మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మిర్యాల దామోదర్, ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య, జిల్లా కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, సీనియర్ సభ్యులు పల్లె మోహన్‌రెడ్డి, లెనిన్, త్రివేణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.