Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు హెల్త్ కమ్యూనిటీ సెంటర్‌ను మహిళల కోసం ప్రసూతి దవాఖానను నెలకొల్పాలని వంద పడకల ఆసపత్రిగా విస్తృతపరచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును సోమవారం ఆలేరు మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ హైదరాబాదులో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పూర్వపు తాలూకా, నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉందన్నారు.హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఆనుకొని , సరిహద్దులో రెండు ప్రధాన నగరాలకు సమ దూరంలో మధ్యన ఉంటుందన్నారు.అట్టడుగున ఉన్న పేద ప్రజల కోసం, వారి ఆరోగ్య పరిరక్షణకు సకల సౌకర్యాలు కల్పించాలని, అందుకోసం ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను విస్తృతపర్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.పరచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.ఈ నెల16న మంత్రి తన్నీరు హరీష్‌రావు యాదగిరిగుట్టలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం శంకుస్థాపనకు వచ్చిన విషయం తెలిసిందేన్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ద్వారా ఆలేరుకు సంబంధించిన పలు ఆరోగ్య విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.ఆలేరులో ప్రసూతి దవాఖాన లేకపోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దూర ప్రాంతాలైన జనగాం, భువనగిరి, హైదరాబాద్, వరంగల్ లకు వెళ్లలేక నానా అగచాట్లు పడుతున్నారని, ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగ, సమస్యల పై మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించి, ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆలేరుకు సంబంధించిన ఈ విషయాలను వెంటనే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.ఆయన హామీతో ఆలేరు ప్రాంతానికి ఆరోగ్యపరిరక్షణ జరుగుతుందన్నారు .సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.ఇక ముందు మరింత అభివృద్ధి చెందే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.