Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే జిల్లావ్యాప్తంగా అన్ని శాఖలకు ఈ ఆఫీస్ సేవల విస్తరణ
- అధికారుల్లో పెరగనున్న జవాబుదారీతనం
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఈఆఫీస్ విధానం ద్వారా సమయం ఆదా, సత్వరన్యాయం,అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట ప్రభుత్వ కార్యాలయాలలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫీస్ విధానాన్ని కలెక్టర్ కార్యాలయం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.ఈఆఫీస్ విధానం ద్వారా సమయం ఆదాతో పాటు ప్రజలకు సత్వరన్యాయం లభిస్తుందన్నారు.ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ ఆఫీస్ విధానం ఉపయోగకరం అన్న మంత్రి నేడు రెవెన్యూ శాఖలో ప్రారంభమైన సేవలు త్వరలోనే జిల్లావ్యాప్తంగా అన్ని శాఖలకు ఈ ఆఫీస్ సేవల విస్తరించనున్నట్లు తెలిపారు.ఈ ఆఫీస్ విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.ఆయా డిపార్ట్మెంట్స్లో ఫైల్స్ మిస్సింగ్ జరుగుతున్నాయన్నారు.ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వస్తే మిస్సింగ్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు.వికలాంగ యువతీ సమస్యపై ఈ ఆఫీసు విధానం లో నేరుగా తహసీల్దార్‌తో మాట్లాడిన మంత్రి రేపటిలోగా యువతీకి న్యాయం జరపాలని అదేశంప్రజావాణి ఆన్లైన్ ద్వారా మంత్రి నేరుగా మండల అధికారులతో మాట్లాడించిన కలెక్టర్ ఎస్.వెంకట్రావు బుడిగ మమత యాతవాకిళ్ళ గ్రామం మఠంపల్లి ఇంటి వెనకాల బాత్రూంలో కట్టకుండా అడ్డుకుంటున్నారని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది.ఆన్లైన్ ప్రజావాణి ద్వారా మంత్రి స్వయంగా ఎంపీడీఓ,తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.మునగాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారావు చెందిన తొమ్మిదెకరాల భూమి ఆన్లైన్లో బ్లాక్‌లిస్టులో ఉందని, సర్వే నెంబర్లు 964 /3, 919/2/3 ఎన్నో నెలలుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని మంత్రికి సుబ్బారావు విన్నవించగా మంత్రి వెంటనే మునగాల ఆర్డీఓ, తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ పాటిల్ హేమంత్‌కేశవ్, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్‌రావు, డీఆర్ఓ రాజేంద్రకుమార్, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధికి ప్రజలు తోడు ఉండాలి.
పట్టణాభివృద్ధికి ప్రజలు తమ తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని తేజ టాకీస్ వద్ద గల జమ్మిగడ్డ బ్రిడ్జి ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి వెడల్పు పెంచుటకు కలెక్టర్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలిసి బిడ్జిని పరిశీలించారు. ప్రజలు కొత్త రోడ్లను, డ్రైనేజీలను నిర్మాణం చేయనప్పుడు ప్రజల పూర్తి సహకారం అందించాలని, నిర్మాణాలకు అడ్డు రాకూడదని, వారికి ఎలాంటి నష్టం రాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం అండర్ పాస్ బ్రిడ్జిల సుందరీకరణ కొరకు ఖమ్మం క్రాస్ రోడ్, అంబేద్కర్ బొమ్మ వద్ద గల అండర్ పాస్ లను కలెక్టర్ పరిశీలించి సుందరీకరణ చేయాలని సీఎంఆర్ సంస్థకు చెందిన అధికారులు శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌లను ఆదేశించారు.బిడ్జికి ఇరుపక్కల పూల మొక్కలు నాటి ఫెన్సింగ్ చేయాలని,అలాగే మన సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే చిత్రాలను బిడ్జి గోడలపై చిత్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, డీఆర్ఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ డీఈడీ.ప్రసాద్, తహసీల్దార్ వెంకన్న, డీఎస్పీ నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు.