Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు స్పందించి తూములను వెంటనే మూయాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ-నూతనకల్
చెరువు తూములను ఎటువంటి అనుమతులు లేకుండా తీసి నీటిని వృధా చేస్తున్న దృశ్యం మండలపరిధిలోని తాళ్ల సింగారంలో రేణిగుంట చెరువులో చోటు చేసుకుంది.రెండు మూడు రోజులుగా తూములను పూర్తిగా తీయడంతో చెరువు నీళ్లు బయటికి వెళ్లి చెరువు ఖాళీ అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు చేపలు పట్టడం కోసమే తూములు తీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చెరువు కింద వరిని సాగు చేశారని, చెరువులోని నీళ్లు పూర్తిగా వెల్లిపోతే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు ఎండిపోయే ప్రమాదం ఉందని అనంతరం పొలాలు కూడా పూర్తిగా ఎండిపోయి పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా తమ స్వార్థం కోసం చెరువునాటిని వృథా చేస్తే చర్యలు తీసుకుని, వెంటనే తూములను మూసివేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.