Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర బడ్జెట్‌ను, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుండి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని, పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ప్రజాతంత్ర వాదులు పోరాటం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం చేస్తూ పెట్రోల్, డీజిల్ , వంటగ్యాసు నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజల మీద అనేక భారాలు మోపి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తు కార్మిక చట్టాలను కార్పోరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ కార్మికులను వీధులపాలు చేస్తుందని దీనిని కార్మికులు ముక్త ఖంటంతో ఖండించాలని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించని కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ప్రగల్బాలు పలుకుతుందని, వారి మాయమాటలు ప్రజలు నమ్మరని, రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రజలు, కార్మికులు, ప్రజాతంత్ర వాదులు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, షేక్ జానీ, నవీన్, నాగరాజు, సుధాకర్, నాగయ్య, కులాచారి, నరసింహారావు, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
మునగాల :కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా మండల కేంద్రంలో సోమవారం సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం వ్యవసాయ రంగానికి సరైన బడ్జెట్ ఇవ్వలేదని విమర్శించారు. దళిత గిరిజనుల పట్ల వివక్షత చూపించారని ఆరోపించారు. మోడీ ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్ పూర్తిగా కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా వుందన్నారు. విదేశీ బ్యాంకుల్లో వున్న నల్ల డబ్బును వెలికి తీసి పేదల ఖాతాలలో జమ చేస్తానని దేశ ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దింపి భారత లౌకిక గణతంత్ర రాజ్యాంగాన్ని కాపా డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ సైదా, సీఐటీయూ జిల్లా నాయకులు బచ్చలకూర స్వరాజ్యం, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు గడ్డం వినోద్, శాఖా కార్యదర్శి కిన్నెర వెంకన్న, పాల్గొన్నారు.