Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ-చివ్వెంల
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు.సోమవారం వట్టిఖమ్మంపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద కూరగాయ వ్యాపార దుకాణాలను పరిశీలించి మాట్లాడారు.రోడ్డు వెంట కూరగాయ దుకాణాలను వెంటనే తొలగించాలన్నారు.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా కూరగాయ వ్యాపారులకు ప్రభుత్వ ఖర్చులతో షెడ్లను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని ఖాశీంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారి వెంట అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డీపీఓ యాదయ్య, ఆర్డీఓ రాజేందర్‌కుమార్, డీఎస్పీ నాగభూషణం, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మీ, సర్పంచ్ జూలకంటి సుధాకర్‌రెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీవోనాగయ్య, ఆర్ఐ రామారావు, పంచాయతీ కార్యదర్శి రజిని,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.