Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైస్ మిల్లుల యాజమాన్యం కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిసర ప్రాంతాలలో వందకు పైగా రైస్ మిల్లులను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మిల్లుల నిర్వాహకులు బాయిల్డ్ వాటర్ శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా సమీపంలోని చెర్వులు, కాల్వల్లోకి వ్యర్థ జలాలు వదులుతున్నారని ఆరోపించారు. కలుషిత జలాలు తాగి చేపలు జలచరాలతో పాటు పశు పక్షాదులు మృత్యువాత పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రైస్ మిల్లుల నుంచి వస్తున్న పొగ, బూడిద, పొట్టు, బాయిల్డ్ వాటర్ వల్ల జల వాయు కాలుష్యం జరుగుతుందన్నారు. ప్రజరోగ్యం పరిరక్షణకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు రైతులు చైతన్య వంతులై కాలుష్య నియంత్రణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్, నరేష్, లాలు, సైదా, ఉమ్లా, నాగేశ్వరావు నాయక్ లు పాల్గొన్నారు.