Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి హాస్పటల్లో తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. తోటి విద్యార్థి సైఫ్ ర్యాగింగ్‌కు పాల్పడడంతో తీవ్రమైన మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసి గత ఐదు రోజుల నుండి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆవేదన చెందారు. కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ప్రీతి బ్రతికి ఉండేదని పేర్కొన్నారు. ప్రీతి ప్రాణాలు కోల్పోవడానికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. అన్యాయంపైన గొంతేత్తి ప్రశ్నిస్తూన్న వరంగల్ విద్యార్థి నాయకులను, విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమన్నారు. అక్రమ అరెస్టులు చేసినప్పటికీ అన్యాయం జరిగిన ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, సరిత, నందిని, మౌనిక, అంజలి, భాగ్యలక్ష్మి, కోటి, కల్పన, రాధిక, శరత్ తదితరులు పాల్గొన్నారు.
నిందితుడు సైఫ్‌ని ఎన్కౌంటర్ చేయాలి : ఏబీవీపీ
మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి మరణానికి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో మూసివేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వినర్ ఆవుల సంపత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయేందర్, ప్రశాంత్, సాయి కిరణ్, చారి, జయంత్, హర్ష, ఉదరు, సహాయం, రవితేజ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : ధరావత్ ప్రీతి మరణానికి కారకుడైన మహమ్మద్ సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్, గిరిజన ప్రజా సమైక్య జిల్లా అధ్యక్షులు రమావత్ సర్దార్‌నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు హరినాయక్ ధరావత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుమలగిరి సాగర్, అనుముల మండలాల్లో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ నరేష్ నాయక్ ,హాలియా పట్టణ అధ్యక్షులు సభావాట్ ప్రదీప్ నాయక్ ,కొటేష్ నాయక్, ఆంగోతు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ప్రీతి మృతి పట్లస్థానిక మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలు నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థినిలు స్థానిక ఎంపీడీవో ఆఫీసు నుండి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మెన్ ఎండీ. మహమ్మద్ అలీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ షహాలా బూతులు, ప్రిన్సిపాల్ డాక్టర్ నేతల హరిబాబు, డాక్టర్ బడే సాహెబ్ వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకునే విధంగా వేధించిన దుండగుడు సైఫ్ ని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీ లో ఆర్ట్స్ కళాశాలలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర సైదా నాయక్ ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాయకులు మల్లేష్, హరి దాస్, తిరుపతి లింగరాజు, అనిల్ నాయక్, ప్రశాంత్ ,సుకన్యా, నికిత, శిరీష, మానస, విజయలక్ష్మి, లక్ష్మీ, ప్రసన్న, వెంకటేష్, పరమేష్, యువరాజ్, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర : వైద్యవిద్యార్థి ప్రీతి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, నిందితుడు సైఫ్‌ను, సహకరించిన వారికి ఉరిశిక్ష విధించాలని బహుజన సమాజ్ పార్టీ మండల ఇన్చార్జి అదిమల్ల వెంకటేష్ పృత్వాన్ని డిమాండు చేశారు. సోమవారం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రమేష్ రాథోడ్, మండల అధ్యక్షులు కుక్కమూడి ముత్యాలు, మండల వైస్ ప్రెసిడెంట్ ఆదిమల్ల సత్యనారాయణ, గ్రామ అధ్యక్షులు ఎలిమినేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : మెడికల్ విద్యార్థి ప్రీతి మరణం అత్యంత బాధాకరం అని ఈ మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని నాంపల్లి మండల బీజేవైఎం అధ్యక్షుడు నాంపల్లి సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయం మండల ఉపాధ్యక్షులు శివగౌడ్, బోల్గం శ్రీకాంత్, నాంపల్లి శివ, దోటి శివ, శ్రీకాంత్‌గౌడ్, కామనబోయిన మోహన్ తదితరులు పాల్గొన్నారు.