Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రజావాణీలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా 38 దరఖాస్తులు వచ్చాయని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారంకై స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులను తమ గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ వార్డులలో నిర్దేశించిన ప్రాంతాలలో అందజేయాలని అదనపు కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి వెంకయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.