Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మిర్యాలగూడలో మార్చి 1న జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని నెహ్రూ గంజ్‌లో నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుండి 3 వరకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 1న జరుగు బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశస్వారోభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న విధానాలపై కార్మికులు గిరిజనులు పేదలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. బహిరంగ సభకు మాజీ ఎంపీలు బృందాకరత్, తమ్మినేని వీరభద్రం, మీడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు నల్లగొండ పట్టణం నుండి పేదలు, గిరిజనులు, మహిళలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు అవురేసు మారయ్య, కార్యదర్శి కాడింగు రవి, మేడబోయిన వీరయ్య, నాగరాజు, వీరబాబు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.