Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓకు అంగన్వాడీల వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంగన్వాడి ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి ఒకటి, రెండు, మూడు తేదీలలో జరిగే సమ్మెకు సహకరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సోమవారం సీడీపీిఓ మమతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, యూనియన్ జిల్లా నాయకురాలు బొందు పార్వతీ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యూటీ చెల్లించాలన్నారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500లు, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1,250 రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్‌తో సహా చెల్లించాలన్నారు. 2017 నుండి టీఏ, డీఏ బకాయిలు మొత్తం చెల్లించాలని, దీనికి సరిపడా బడ్జెట్‌ను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. అంగన్వాడీలకు రావాల్సిన అన్ని లాభాలను సత్వరమే చేకూర్చాలని, తదితర డిమాండ్లను నేరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడి అరుణ, బెజ్జం నాగమణి, స్వరాజ్యం, జి. రజిత, ఝాన్సీ, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై నేడు హైదరాబాదులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు మర్రిగూడ మండల గ్రామపంచాయతీ కార్మికులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ ఝాన్సీ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, తుప్పరి యాదయ్య, పెరుమాండ్ల మంజుల, ఊరి పక్క వెంకటయ్య, ఎడ్ల అంజయ్య, రైతు సంఘం నాయకులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, ఉప్పునూతల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.