Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్‌గా ఉందని, కార్పొరేట్ బౌల జాతి కంపెనీలకు అనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నివేదికను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానం కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా సంపన్నులకు సబ్సిడీ రూపంలో కంపెనీలకు కట్టబెట్టుతుందన్నారు. పేదలకు అన్ని రకాల టాక్సీ పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపుతున్నారు. ఇవే కాకుండా రైతులకు నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులకు కూడా నష్టం చేసే విధంగా ఉందని విమర్శించారు. గతంలో రైతు చట్టాల వ్యతిరేక ఢిల్లీ పోరాటం సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగివచ్చి మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో పెడతామని రాతపూర్వకంగా రాసి ఇచ్చినప్పటికీ నేటికీ అతిగతి లేదని తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మంండల కార్యదర్శి మిర్యాల భరత్, సాగర్ల మల్లేష్, నారగోని నరసింహ, సింగపంగా గౌరయ్య, వంటేపాక అయోధ్య, సింగం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు నిరసనగా మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం మండల సీఐటీయూ, రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, జీఎంపీఎస్ మండల నాయకులు మైల సత్తయ్య, పెరుమాండ్ల మంజుల, ఊరు పక్క వెంకటయ్య, నందిపాటి సుగుణ, జిల్లా అమృత, ఎండీ. నస్రిన్, జిల్లా లక్ష్మయ్య, వడ్లమూని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.