Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దైవచింతనతో మానసిక ప్రశాంతతలి
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సూర్యాపేట మండలపరిధిలోని రామచంద్రపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ మత ఆచారాలకు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉండాలన్నారు.దైవఆరాధనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు.మతాలకు అనుగుణంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహించే గొప్ప సంస్కతి, దేశంలో తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే ఉందన్నారు. గ్రామ దేవత లకు ప్రతీక అయిన బొడ్రాయి పండుగ సంద్భంగా రామచంద్రపురం గ్రామస్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.కంఠ మహేశ్వరుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కలగాలనీ మంత్రి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, గ్రంధాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడిభిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాసనాయుడు, మండలఅధ్యక్షులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, మాలి కవిత అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ మండల్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి,మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, భూపతి అంజయ్య, కుంభం శ్రీరాములు అనంతుల సురేష్, అనంతుల ఎల్లయ్య తండా వెంకటయ్య గుండగాని అంజయ్య, మునగాని చిన్నవెంకన్న, గుడిసె అంజయ్య, చింతల అంజయ్య, జలగం సత్తయ్య ,చౌగోని మల్సూర్ ,బత్తిని యాదగిరి, గుండగాని నాగభూషణం,లింగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.