Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం జగన్మోహిని అలంకారంలో ఊరేగిన నరసింహుడు
నవతెలంగాణ యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎదుర్కోలు మహోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు లక్ష్మీనరసింహస్వామిని అశ్వవాహన దారుడై భక్తకోటిని కటాక్షిస్తూ తిరువీధి ఉత్సవ సేవలో ఆస్థానమండపంలోకి రాగా ఒకవైపు అమ్మవారు సర్వ అలంకార శోభితురాలై స్వామి అనుగ్రహాన్ని లోకాలకు అందించేందుకు విశ్వశాంతికోసం కల్యాణ మహోత్సవాన్ని స్వీకరించదలిచి నిర్వహించేదే ఎదుర్కోలు మహోత్సవమని అర్చకులు తెలిపారు.అమ్మవారి పడమర విశ్వరూపాన్ని ఈ వేడుక తెలియజేస్తుందన్నారు.ఎదుర్కోలు ఉత్సవం నేటి కల్యాణ ఉత్సవ సువార్త నిర్ణయంతో వేద పండితుల వైదిక ఆశీర్వచన ప్రక్రియలతో భక్తిపూర్వకంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి,కలెక్టర్ పమేలాసత్పతి, ధర్మకర్త నర్సింహాముర్తి,ఈఓ గీతారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు
జగన్మోహిని అలంకారంలో నరసింహుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామిని జగన్మోహిని స్వరూపంలో ఉదయం భక్తులకు దర్శనం కల్పించారు.తన జగన్మోహన లీలా విలాపాలను తెలియజేస్తూ భక్తుల సంరక్షించే అపూర్వమైన స్వరూపమే జగన్మోహిని అవతారమని అర్చకులు తెలిపారు.
కొనసాగుతున్న ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు
కొండపైన ధార్మిక సంగీత సాహిత్య మహాసభలు వైభవంగా కొనసాగుతున్నాయి.మంగళవారం ఉదయం శ్రీ రామభక్త భజన మండలి రాయగిరి వారితో సాయిబాబా సేవా సమితి వారితో భజన ,ఆస్థానం వారితో మంగళ వాయిద్యం,వైదిక ప్రార్థన,శ్రీమాన్ టీఎస్సీ కష్ణమాచార్యుల సిద్ధాంతితో యాదగిరి క్షేత్రం మహిమ గురించి ఉపన్యాసం నిర్వహించారు.మడమల రాంబాబు బాగవతర్తో గజేంద్రమోక్షం హరికథ చేపట్టారు.శ్రీ రామాంజనేయ భజన మండలి వారితో భజన కార్యక్రమం నిర్వహించారు.
ఉచిత వైద్య శిబిరం
కొండపైన భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారితో కొండపైన ,కొండ కింద, కల్యాణకట్ట వద్ద వైద్య శిబిరం చేపట్టారు.శ్రీకర హాస్పిటల్స్ ,సాయి సంజీవని హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఇష్ట వైద్య శిబిరం నిర్వహించారు.